హీరో సిద్ధార్థ్‌తో ప్రేమలో పడిందని సమంత గురించి అందరికీ తెలిసిన న్యూసే. మేము లవ్‌లో ఉన్నామని పబ్లిగ్గా అంగీకరించకపోయినా కానీ ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, సిద్ధూ మైకంలో సమంత పూర్తిగా మునిగిపోయిందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.
తన లవర్‌తో వరుసగా నటించడానికి కూడా సమంత సిద్ధంగా ఉన్నా కానీ ఆమెకి ఉన్న అవకాశాలని వదులుకోవద్దని అతను ఆమెకి సలహాలిస్తున్నాడు. తన సినిమాలో నటించేదానికంటే సమంత వేరే స్టార్స్‌తో నటిస్తే ఉండే లాభం సిద్ధూకి తెలియనిది కాదు. అలా అని సమంత ఫ్యాక్టర్‌ని వదులుకోలేడు కదా? తన సమ్‌థింగ్ సమ్‌థింగ్ సినిమాలో ఆమెతో ఒక చిన్న క్యారెక్టర్ చేయించాడు.
సమంత ఉందంటే తన సినిమాకి ప్లస్ అవుతుందని సిద్ధార్థ్‌కి బాగా తెలుసు. ఈ చిత్రంలో రాణా కూడా అతిథి పాత్ర పోషించాడు. సిద్ధార్థ్, రాణా ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. గోపీచంద్ పెళ్లిలో ఈ విషయం గుర్తించే ఉంటారు.