ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 10 May 2013

    ప్రేమ మైకంలో ఆ ముగ్గురు...


    ప్రేమ అనే పదానికి తావు లేని జీవితం ఆమెది. శరీరాన్ని పంచడమే తనకు తెలుసు. అలాంటి ఓ వేశ్య జీవితంతో ప్రేమ ఆడిన గమ్మత్తై నాటకమే ‘ప్రేమ ఒక మైకం’. వేశ్య, గాయని, రచయిత ఈ మూడు పాత్రల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వేశ్యగా ప్రధాన భూమికను చార్మి పోషిస్తున్న విషయం తెలిసిందే.

    ‘టెన్త్‌క్లాస్’ఫేం చందు దర్శకత్వంలో డి.వెంకటసురేష్, కె.సూర్య శ్రీకాంత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘‘ఇదొక చిత్రమైన కథ. చార్మి అద్భుతమైన నటనాపటిమకు నిలువెత్తు సాక్ష్యంగా ఈ సినిమా నిలుస్తుంది. ఇందులో ఆమె హైక్లాస్ కాల్‌గాళ్‌గా నటిస్తున్నారు.

    ఆమె పాత్ర పేరు మల్లిక. ఓ కొత్త చార్మీని ఇందులో చూస్తారు. సంగీత పరంగా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుంది. పులగం సి.నారాయణ రాసిన సంభాషణలు ఈ చిత్రానికి వెన్నెముక. ఆలోచింపజేసే విధంగా ఇందులో డైలాగ్స్ ఉంటాయి. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి జూన్ 7న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.

    ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, పాటలు: కులశేఖర్, శశి, సంగీతం: ఎం.జి.కె.ప్రవీణ్, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.గీతానందరెడ్డి, సమర్పణ: బేబీ హ్యాపి, నిర్మాణం: టూరింగ్ టాకీస్.

    Tollywood

    Bollywood

    Kollywood