ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Monday, 13 May 2013

అటు ఎన్టీఆర్‌తో... ఇటు చరణ్‌తో

అటు ఎన్టీఆర్‌తో... ఇటు చరణ్‌తో

గబ్బర్‌సింగ్‌ విజయంతో శృతిహాసన్‌ ఎంత బిజీ అయిపోయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ బిజీ టైమ్‌లో తనకి వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవడానికి శృతి చాలా కష్టపడాల్సి వస్తోంది. ఒకే రోజు రెండేసి షిఫ్టుల చొప్పున పని చేయకపోతే శృతి షెడ్యూల్స్‌ సజావుగా సాగడం లేదు.

అందుకే తన సినిమాల షూటింగ్‌ లొకేషన్స్‌ ఉండేలా ఆమె జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఆమె 'రామయ్యా వస్తావయ్యా', 'ఎవడు' షూటింగ్‌లో ఒకేసారి పాల్గొంటోంది. ఒక రోజుని రెండు షిఫ్టులుగా విభజించి రెండు సినిమాలకీ ఇచ్చింది. వారు కూడా శృతి బిజీని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా షూటింగ్‌ చేస్తున్నారు.

జూన్‌ నుంచి ఆగస్ట్‌లోగా ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదల కానున్నాయంటే శృతి ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందీలో రామయ్యా వస్తావయ్యా, తెలుగులో బలుపు, ఎవడు, రామయ్యా వస్తావయ్యా చిత్రాలు వరుసగా రిలీజ్‌ అవుతాయి.

Post Comments