ఎన్నో మధురమైన పాటలకు తన గొంతుతో ప్రాణం పోసింది గీతామాధురి. ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లి పాట పాడబోతోంది. ఔను.. గీత త్వరలో పెళ్లి కూతురిగా ముస్తాబవుతోంది. తనది ప్రేమ పెళ్లే. నటుడు ఆనంద్ కృష్ణ (100 % లవ్ ఫేమ్)తో గీతా మాధురి కొంత కాలంగా ప్రేమలో ఉంది. ఇద్దరూ కలిసి `అతిథి` అనే లఘు చిత్రానికి పనిచేశారు. అప్పుడే వీరిద్దరి మధ్య బంధం బలపడింది. ఇంట్లో కూడా వీరిద్దరి పెళ్లికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే శుభవార్త వినొచ్చు. గీతా మాధురీ… ఆల్ ది బెస్ట్!