ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 25 July 2013

    చేతులెత్తేసిన మహేష్‌ '1' మేకర్స్‌!

    Mahesh babu, One Movie Producers, in Trouble
    ఎంతటి సూపర్‌స్టార్‌తో సినిమా తీస్తున్నా కానీ ప్రతి దానికీ ఓ హద్దు అంటూ ఉంటుంది. ఓ హద్దు దాటితే నంబర్‌వన్‌ హీరోతో సినిమా తీసినా కానీ సేఫ్‌ అవుతుందో లేదో అనే భయం పట్టుకుంటుంది. మహేష్‌బాబుతో 1 చిత్రాన్ని నిర్మిస్తున్న వారికి ఇప్పుడు అదే కంగారు పట్టుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని చాలా కాలంగా షూట్‌ చేస్తున్న సుకుమార్‌ ఎంతకీ సినిమాని ఒక కొలిక్కి తీసుకురావడం లేదట. అదే పనిగా తీసిందే తీసి విసిగిస్తున్నాడట. అతని క్రియేటివిటీపై నమ్మకం ఉన్న మహేష్‌బాబు కూడా ఏమీ అనడం లేదట. దీంతో బడ్జెట్‌ ఇప్పటికే తడిసి మోపెడయింది. యాభై కోట్లకి పైగా వెచ్చించినా కానీ ఇంకా చాలా పార్ట్‌ షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉండపోయింది.

    అరవై అయిదు కోట్లకి పైగానే బడ్జెట్‌ అవుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అదే జరిగితే ఈ చిత్రం కాస్ట్‌లియస్ట్‌ తెలుగు సినిమా అవుతుంది. మహేష్‌బాబు బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన దూకుడు యాభై ఆరు కోట్ల షేర్‌ వసూలు చేసింది. 1 చిత్రం సేఫ్‌ అవ్వాలంటే ఇప్పుడు దానిని దాటి మరీ ఆడేయాలి. ఖచ్చితంగా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయితే తప్ప ఈ చిత్రం సేఫ్‌ జోన్‌లోకి వెళ్లదు. ఇప్పటికే చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టిన నిర్మాతలు కూడా చేతులెత్తేశారని, ఇలా అయితే తమ వల్ల కాదని అంటున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ చిత్రంతో సక్సెస్‌ సాధించకపోయినట్టయితే మాత్రం సుకుమార్‌కి చాలా బ్యాడ్‌ నేమ్‌ వస్తుందనడంలో సందేహం లేదు.

    Tollywood

    Bollywood

    Kollywood