మెగాస్టార్ కుటుంబం మధ్య ఉన్న విభేదాలు కేవలం రూమర్లు అయితే కాదు... వాటి గురించి అధికారికంగా ఎవరూ వివరణ ఇవ్వకపోయినా.. మెగా అన్నదమ్ముల మధ్య విభేదాలు సుస్పష్టం. అయితే ఈ విభేదాలు పవన్ ఇమేజ్ ను అమాంతం పెంచుతున్నాయని ఒక అంచనా. చిరంజీవి పార్టీ పెట్టడం, దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం... ఆ విలీనం జరిగాకా.. పవన్ చిరు కు మరింత దూరం జరిగాడు. దీంతో పవన్ కు అన్నతీరు ఏ మాత్రం నచ్చడం లేదు అనే ప్రచారం ఊపందుకుంది. చిరు-పవన్ ల మధ్య అగాథం పెరగడానికి కారణం ఏమైనా... ఈ మొత్తం వ్యవహారంలో చిరంజీవి డబ్బు, పదవుల కోసం ఆశపడే వాడిగా మిగిలితే.. పవన్ మాత్రం డబ్బు కు ఇతర ప్రలోభాలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వడు అనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి.
ఇక కాంగ్రెస్ లో చేరడంతోనే చిరంజీవికి వ్యక్తిగత ఇమేజి దారుణంగా పడిపోవడం, రోడ్డు మీద గొడవతో చరణ్ ఇమేజికి కూడా డ్యామేజీ వచ్చింది. ఓవరాల్ గా చిరు, చరణ్ లు వ్యక్తిగతంగా అంత చెప్పుకోదగిన వారు కాదు అనే అభిప్రాయాలు బలపడ్డాయి. పవన్ వ్యక్తిగతంగా రెండు వివాహాల వాడు అయినా... ఇప్పుడు ఆయన వ్యక్తిత్వానికి చిరంజీవితో వచ్చిన పోలికతో బెటర్ అనిపిస్తున్నాడు. అన్నను మించిన వాడు అవుతున్నాడు! వ్యక్తిత్వం విషయంలో చిరు గురించి చెప్పుకోవడానికి ఏమీలేదని అదే పవన్ మాత్రం పులి లాంటి వాడని సగటు మెగాఫ్యామిలీ అభిమాని వ్యాఖ్యానిస్తున్నాడంటే... పరిస్థితి ఎక్కడి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు!