టాలీవుడ్ బ్యూటీ సమంత హైదరాబాద్ లో తన కోరికను తీర్చుకుందట. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా చెప్పింది. ఇంతకీ సమంత కోరిక తీర్చింది ఎవరో తెలుసా? ఇంకెవరు ఆమె అసిస్టెంటే. అసలు సంగతి ఏమిటంటే... సమంతకీ హైదరాబాద్ రోడ్లపై బైక్ తో చక్కర్లు కొట్టాలని ఎప్పటినుంచో కోరిక వుందట. అయితే సెలబ్రిటీలకు, ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారికి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. వీరు బయట కనిపిస్తే ఇక అంతే. దీంతో సమంత తన అసిస్టెంటే తో కలిసి తన కోర్కెను తీర్చుకొని పుల్ ఎంజాయ్ చేసినట్లు చెప్పింది.
ఆర్యతో కలిసి ఈ మధ్య ఒకరోజు అంతా హైదరాబాదు వీధుల్లో ఝామ్మంటూ బైక్ మీద తిరిగానని చెబుతుంది. ఈ చల్లని వాతావరణంలో ఆర్యా బైక్ మీద కూర్చుని భాగ్యనగరం వీధుల్లో అలా అలా వెళ్లిపోతుంటే హాయిగా వుందని సమంతా ట్విట్ చేసింది. ప్రస్తుతం సమంత నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది.