ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 27 July 2013

    కాంగ్రెస్ కు ఖతర్నాక్ డోస్ ఇచ్చిన జగన్

    Congress, Jagan Mohan Reddy, Shock
    తెలంగాణలో జగన్ ను చావుదెబ్బ తీసామని తెగ చంకలు గుద్దుకుంటున్న కాంగ్రేస్ కు అసలైన ఎసరు జగన్ పెట్టాడన్న దానిని గుర్తించలేకపోతోంది. తెలంగాణలో జగన్ కు ఎలాగు భవిష్యత్ లేదని ఇప్పుడే కాదు పార్టీ పెట్టినప్పటినుంచి సర్వేలు చెబుతున్నాయి, జగన్ ఒప్పుకుంటున్నాడు. తనకు పట్టులేని తెలంగాణను కాంగ్రేస్ కు ఎరగా వేసి సీమాంధ్రలో కాంగ్రేస్ ఖతర్నాక్ డోస్ ఇచ్చాడని కాంగ్రేస్ సీనియర్లే అంటున్నారని రాజకీయపరిశీలకులు చెబుతున్నారు.

    అందుకే వైఎఎస్సిర్ సిపిని తెలంగాణలో బలోపేతం చేయడంపై జగన్ ముందునుంచి అంత ఆసక్థి కనపరచలేదని జగమెరిగిన సత్యం. వచ్చేవారిని కాదనక కేవలం ఉనికి కోసం తెలంగాణలో పార్టీని అలా నడిపించాడన్నది అందరికి తెలిసిందే. ఎలాగూ తెలంగాణ ఇస్థే అక్కడ కేసిఆర్, లేదా కాంగ్రేస్ పోటీ పడతాయి కాని వైఎస్సార్ సిపి కాదన్నది అందరికి తెలిసిందే.

    అందుకే తెలంగాణ ఇస్థోంది అన్నకాంగ్రేస్ టాక్ వెలుబడగానే క్షణం ఆలస్యం చేయకుండా జగన్ తూటా పేల్చాడు. అది ఎంత పవర్ పాయింట్ లో తగిలిదంటే, ఇక నిర్ణయం ప్రకటించే దాకా వెల్లిన కాంగ్రేస్ ను అక్కడే నిలిపి వేసింది. ఎందరో సీమాంద్రనేతలు ప్రయత్నాలు చేసినా కాదు, పోండి అన్న అధిష్టానం జగన్ రాజీనామాల అస్థ్రాన్ని చూసి కంగుతిని నిర్ణయంపై డ్రాప్ అయి ఇప్పుడేంటా అంటూ ఆలోచనలో పడింది అంటున్నారు కాంగ్రేస్ పార్టీకే చెందిన పలువురు సీమాంధ్ర నాయకులు.

    ఇప్పుడు సీమాంధ్రలో జగన్ హీరో అయ్యాడనడంలో సందేహం లేదు, తెలంగాణ నిర్ణయం తీసుకుంటోంది అన్న వార్థలతో లగడపాటి, చిరంజీవి,కావూరి వంటి వారే పునరాలోచనలో పడగా ఏకంగా సిఎం కిరణ్ పార్టీకి, పదవికి  రాజీనామానే చేస్థానన్న పరిస్థితికి వచ్చేసాడు. అంటే వారందరికి ఇప్పుడు సీమాంధ్రలో ఏపార్టీ దిక్కు, అంటే గోళ్లు కొరుక్కునే పిల్లోడయినా సరే అది వైఎస్సార్ సిపి అంటారు.

    ఏమి లేని తెలంగాణలో దెబ్బతీసామని కాంగ్రేస్ సంబరపడి పోతుంటే, వల వేసి సీమాంధ్రలోని కాంగ్రేస్ నంతా ఎగరేసుకుపోయే పనిలో జగన్ దాదాపు సక్సెస్ అవుతున్నాడన్న సంకేతాలే కనిపిస్థున్నాయని రాజకీయపరిశీలకులు అంటున్నారు. చూసారా... జ‘గన్’ జైల్లో ఉన్నాకూడా బయట ఎంత పవర్ ఫుల్ గా పేలిందో అంటున్నాయి రాజకీయ వర్గాలు.

    Tollywood

    Bollywood

    Kollywood