ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 12 July 2013

    జగన్ కి బెయిల్ రావటం చాలా అవసరం

    Bail | Very Important | Jagan Mohan Reddy
    జైల్లో ఉంటే చాలు ఎన్నికలకు అనర్హులే.  జైల్లో ఉన్నవాళ్ళు ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి అనర్హులంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.   అయితే బెయిల్ మీద బయట ఉన్నట్లయితే పోటీ చెయ్యవచ్చన్నది దానికి మినహాయింపు.  ఇదీ బుధవారం జస్టిస్ ఎ కె పట్నా, జస్టిస్ ఎస్ జె ముఖ్యోపాధ్యాయ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పులో భాగం.

    పాట్నా హైకోర్టు పోలీస్ కస్టడీలో ఉన్న కొందరు నాయకులు ఎన్నికలలో పోటీ చెయ్యటానికి వీల్లేదని ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ మీద సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది.

    శాసనసభ్యులుకానీ, పార్లమెంటు సభ్యులు కానీ నేరారోపణలో ఉన్నట్లయితే, వాళ్ళు అలా నేరారోపణ జరిగిన దగ్గర్నుంచి అనర్హులని, బుధవారం నాడు సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.   అంతేకాదు, వాళ్ళు ఒకవేళ పై కోర్టుకి అప్పీలు చేసుకుని ఉన్నాసరే అందులో సడలింపు లేదని ధర్మాసనం కచ్చితంగా చెప్పింది.

    పోలీసు కస్టడీలో ఉన్నవాళ్ళు ఓటు వేసే హక్కుని కోల్పోతారని ఉన్న అంశాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుని, ఓటు హక్కే లేనప్పుడు అటువంటి వాళ్ళకి ఎన్నికలలో పోటీ చేసే హక్కు అసలే లేదని స్పష్టం చేసింది.  అంతేకాకుండా, జైల్లో ఉన్నవాళ్ళ మీద ఛార్జ్ షీట్ లేకపోయినా సరే వాళ్ళు అనర్హులేనని ధర్మాసనం తేల్చింది.

    అయితే ముందస్తు జాగ్రత్తకోసం చేసే ప్రివెన్టివ్ డిటెన్షన్ కింద కస్టడీలో ఉన్నవాళ్ళకీ నియమం వర్తించదని కూడా సుప్రీంకోర్టు వివరణనిచ్చింది.

    ఈ తీర్పు వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ కి పెద్ద దెబ్బేనని చెప్పాలి.  సంవత్సరం పైనే జైల్లో ఉన్న జగన్ ఆ విధంగా ఎన్నికలలో పోటీ చేసే అర్హతను ప్రస్తుతం పోగొట్టుకుని ఉన్నారు.  అందువలన జగన్ బెయిల్ మీద బయటకు రావటం ఆ పార్టీకి అత్యంత ఆవశ్యకమౌతోంది.

    Tollywood

    Bollywood

    Kollywood