ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 1 August 2013

    రవితేజ ఫ్రమ్ ఆంధ్రా అంటున్న మాస్ మహారాజ.!

    Raviteja From Andhra
    హీరో రవితేజ తన చిన్నపుడు ‘రవితేజ ఫ్రమ్ ఆంధ్ర’ అని గర్వంగా చెప్పుకునేవాడట. ఈ మాటలు చూసి మన మాస్ మహారాజా సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడని అనుకోకండి సుమ, ఇది వేరే విషయం రవితేజా తండ్రిది పశ్చమ గోదావరి జిల్లాలోని ఖండవిల్లి రవితేజ తల్లిది మాత్రం తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట. కానీ మన హీరో తను పుట్టిన ఆరు నెలలకే తన తండ్రి ఉద్యోగ రీత్యా ఉత్తరాది వెళ్ళిపోయాడు. ఢిల్లీ, ముంబాయి, జైపూర్ లలో రవితేజ బాల్యం అంత గడిచింది. దానితో అతడికి మరాఠీ వచ్చింది కాని తెలుగు అంత బాగా రాలేదట. స్కూల్ లో మాత్రం హిందీలో పాఠాలు చెప్పేవారనీ కానీ తన పేరు ఏమిటి అని ఎవరడిగినా మాత్రం ‘రవితేజ ఫ్రమ్ ఆంధ్ర’ అని గర్వంగా చెప్పేవాడినని రవితేజా ఈ మధ్య చెప్పాడు.

    తనను బాగా ప్రభావితం చేసిన సినిమా ‘షోలే’ అని చెపుతూ ఆ సినిమా చూసిన తరువాత తాను అమితాబ్ కు వీరాభిమానిగా మారిపోయానని రవితేజ అన్నాడు. ఇక అతడి సినిమాలు పిచ్చ గురించి చెపుతూ తన తల్లి పూజ చేసే దేవుడి పటము దగ్గర ఉన్న డబ్బులు తన తల్లి పరుసులోని డబ్బులు కొట్టేసి వరస పెట్టి సినిమాలు చూసేవాడినని అలా వరుస పెట్టి సినిమాలకు వెళుతున్న సమయంలో తన తల్లికి దొరికిపోయి ఆమె ఏమంటుందో అన్న భయంతో భోపాల్ టు ముంబాయి రైలు ఎక్కి పారిపోదామనుకున్నానని, కానీ చివరి నిముషంలో తన మనసు మార్చుకుని తన తల్లి దగ్గరకు వెళ్లి తిట్లు తిన్నానని ఆ విపరీతమైన సినిమా వ్యామోహమే తనను స్టార్ గా మార్చాయని రవితేజా అంటున్నాడు...

    Tollywood

    Bollywood

    Kollywood