ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 29 September 2013

    ప్రతి సినిమాకు కాప‌లా అంటే ఎలా?

    దేశంలో ఎక్కడ లేని విధంగా మ‌న స్టేట్ లో పోలీసుల్ని కాప‌ల పెట్టి సినిమాలు విడుద‌ల చేసుకోవాల్సి రావడం బాధ‌క‌ర‌మే. రాష్ట్రంలో నెల‌కొన్న ప్రత్యేక ప‌రిస్దితులు పెద్ద హీరో ల చిత్రాల పాలిటి శాపంగా మారాయి. అయితే రామ్ చ‌ర‌ణ్ జంజీర్ తో ధైర్యం చేసి విడుద‌ల చేయ‌డంతో.. తాజాగా ప‌వ‌ర్ స్టార్ సినిమాకు కూడా కొంత క‌ల‌సొచ్చింది. “తుఫాన్” విష‌యంలో ఉద్యమ కారుల నుంచి వ‌చ్చిన వ్యతిరేక‌త‌ను ఎదుర్కొవ‌డానికి పోలీసుల స‌హ‌కారం తీసుకున్నారు. వివాదం అవుతుందనుకున్న …థియేట‌ర్స్ ముందు పోలీసుల్ని ఉంచి న‌డిపించారు.

    ఇక ఇదే త‌ర‌హాలో “అత్తారింటికి దారేది” చిత్రాన్నికి కూడా స‌మైక్యాంధ్ర ఉద్యమం న‌డుస్తున్న కొన్ని ప్రాంతాల్లో థియేట‌ర్స్ ముందు పోలీసుల్ని ఉంచారు. మ‌రి ఇలా విడుద‌ల‌య్యే ప్రతి పెద్ద హీరో సినిమాకు పోలీసుల్ని పెట్టి న‌డిపించాలంటే క‌ష్టమే క‌దా. ..? అక్టోబ‌ర్ లో యంగ్ టైగ‌ర్ న‌టించిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా, మంచు మ‌నోజ్.. వెంక‌టేష్ , రామ్ ల “మ‌సాల‌ష‌, వీలైతే రామ్ చ‌ర‌ణ్ “ఎవ‌డు” .. ఆ త‌రువాత నాగార్జున “భాయ్” చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మ‌రి ఇదే త‌ర‌హాలో ఈ పెద్ద చిత్రాలు రిలీజ్ చేయాలంటే త‌ల‌నొప్పె క‌దా…? ఉద్యమ ప్రాంతంలో ఆడియెన్స్ కూడా అంతగా విర‌గ‌బ‌డి అయితే ఏ సినిమాకు రావ‌డం లేద‌ని మాత్రం వ‌స్తున్న క‌లెక్షన్స్ ను బ‌ట్టి తెలుస్తుంది. మ‌రి ఇదే ప‌రిస్ధితి కొన‌సాగితే టాలీవుడ్ సినిమాల ప‌రిస్ధితి ఎలా వుంటుందో చూడాలి.

    Tollywood

    Bollywood

    Kollywood