ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 29 September 2013

    రాష్ట్రపతి పాలనకోసం సిద్దమైన గవర్నర్ నోట్

    రాష్ట్రపతి పాలనకోసం సిద్దమైన గవర్నర్ నోట్
    ఫ్లాష్ న్యూస్... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం అంత రెడీ అవుతోందట, ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ఓ నోట్ కూడా  తయారు చేసి నేడో, రేపో రాష్ట్రపతికి, కేంద్రప్రభుత్వానికి పంపిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం, ఈ నోట్ ను నరసింహన్ శనివారం రాత్రే హుటాహుటిన తయారు చేసాడు అంటున్నారు.

    సిఎం తాజా విలేఖరుల సమావేశం, తదనంతరం తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు అడ్డగోలుగా ముఖ్యమంత్రిపై విరుచుకు పడడం, టిఆర్ఎస్, టిడిపి నేతలతో సహా అధిపతులు కేసిఆర్, చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా స్పందించి రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే అనడం వంటివి ఈ నిర్ణయానికి ప్రధానం కారణం అంటున్నారు. అంతే కాదు అటు సీమాంద్రలోని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడ పోతున్నారంటూ రివర్స్ అవుతుండడంతో ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి అన్న భావనకు గవర్నర్ కూడా వచ్చేసాడంటున్నారు.

    మంత్రులే ఎదురు తిరిగాక రాష్ట్రంలో సిఎం పాలన ఎలా చేస్తాడు, అంతే కాదు సిఎం కూడా సోనియా నిర్ణయాన్ని వమ్ము చేసేందుకే అధికారంలో ఉన్నాను, అడ్డుకున్నాకే సిఎం సీటు నుంచి తప్పుకుంటాను అని క్లియర్ చేయడం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అంటున్నారు. పైగా దిగ్విజయ్ సింగ్ పై కూడా డైరెక్టు పైర్ కావడం కూడా తీవ్రప్రభావం చూపెట్టింది అంటున్నారు. అందుకే మూడునాలుగు రోజుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అన్న వార్తలు గవర్నర్ నరసింహన్ కార్యాలయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood