ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 28 September 2013

    ప‌వ‌ర్ స్టార్ దెబ్బకి బాలీవుడ్ కూడా షేక్ అయింది

    ప‌వ‌ర్ స్టార్ దెబ్బకి బాలీవుడ్ కూడా షేక్ అయింది
    ప‌వ‌ర్ స్టారా మ‌జాకా..! ఆయ‌న ప్రభంజ‌నం ఒక్క టాలీవుడ్ .. సౌత్ కే కాదండోయ్ . బాలీవుడ్ కు కూడా పాకింది. ప‌వ‌ర్ స్టార్ న‌టించ‌న లేటెస్ట్ మూవీ “అత్తారింటికి దారేది” విడుద‌ల‌కు ఎన్నో అవాంతరాలు ఎదురైన‌.. ఎట్టకేల‌కు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల‌కు పైగాథియెట‌ర్స్ లో విడుద‌లైన ఈ చిత్రం కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. రెండో రోజూ కూడా అదే క‌లెక్షన్స్…అలాగే ధియేట‌ర్స్ హౌస్ పుల్ అయిపోతున్నాయి.

    నిజానికి తెలుగు లోనే కాకుండా.. త‌మిళ‌, క‌న్నడ , మ‌ల‌యాళంలో కూడా తెలుగు ప్రేక్షకుల కోసం కొన్ని థియేట‌ర్స్ లో అత్తారింటికి దారేది సినిమాను రిలీజ్ చేయ‌డంతో… హింది హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న న‌టించిన లేటెస్ట్ ఫిల్మ్ “బెష‌ర‌మ్” ను అక్టోబ‌ర్ 2 న విడుద‌ల చేయ‌డానికి వెన‌క‌డ‌గు వేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ సినిమాను సౌత్ లో ఈ టైమ్ లో విడుద‌ల చేస్తే.. త‌న సినిమాకు క‌లెక్షన్స్ రావ‌డం క‌ష్టమేన‌ని భ‌య ప‌డుతున్నాడ‌ట‌. దీంతో బెష‌రమ్ విడుద‌లను ఒక వారం పాటు వాయిదా వేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నట్లు బాలీవుడ్ క‌బ‌ర్. . ఏమైనా ప‌వ‌న్ సినిమా ఎఫెక్ట్ బాలీవుడ్ కు త‌గ‌ల‌డం విశేషం…!

    Tollywood

    Bollywood

    Kollywood