వినాయకుడు, శౌర్యం, గగనం సినిమాలతో ఆకట్టుకున్న నటి పూనమ్‌కౌర్. చూడ్డానికి లక్షణంగా ఉన్నా ఎందుకో ఈ భామకు తెలుగు పరిశ్రమ పెద్దగా అచ్చి రాలేదు. కానీ కోలీవుడ్ మాత్రం బాగానే కలిసొస్తోంది. తాజాగా అక్కడ ఐదు సినిమాలు చేస్తోంది. ఓ సినిమాలోని ఓ పాటకు పూనమ్ 400 రకాల డ్రస్సులను వేసుకుంటోందట. ఆ సినిమా పేరు రణం. ఈ సినిమాలోని పాటకు పూనమ్ వేసుకునే డ్రస్సులు రికార్డులు సృష్టిస్తాయని భావిస్తోంది పూనమ్ కౌర్.
ఎప్పుడూ ఏదో కొత్తదనంతో సినిమాల్లో చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. మూసలో వెళ్లడం నాకిష్టం ఉండదు అని చెప్తోంది పూనమ్. తెలుగులో ఆడు మగాడురా బుజ్జీలోనూ నటిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కాదు. సుధీర్‌బాబు చెల్లెలి పాత్రలో నటిస్తోంది. కానీ అస్మితాసూద్‌కన్నా, సుధీర్‌బాబు, పూనమ్ మధ్య ఎక్కువగా సన్నివేశాలుంటాయట. ఈ సినిమాలో పూనమ్ కి తప్పకుండా బ్రేక్ వస్తుందని వినికిడి.