ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 13 October 2013

    దర్శకుడిని వణికిస్తున్న పవన్

    Gabbar Singh 2, Pawan Kalyan, Pawan
    టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ ను పవన్ కళ్యాణ్ వణికిస్తున్నాడు, అంతే కాదు పవన్ కళ్యాణ్ ను తలచుకుని ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అంతగా బెదిరిస్తున్నాడా, అది కూడా ఓ డైరెక్టర్ ని, ఆయన నైజం అలాంటిది కాదే అనుకుంటున్నారా... అయితే అదే నిజం.

    కాని పవన్ ను తలచుకుని డైరెక్టర్ సంపత్ నంది వణికిపోతున్నది కూడా నిజమే. పవన్ కోసం ఆయన నిద్రలేని రాత్రులు గడపుతూ కథ, స్క్రిప్ట్ తయారీలో తలమునకలయ్యాడు. కారణం పవన్ ‘ గబ్బర్ సింగ్’  సీక్వెల్ గా ‘గబ్బర్ సింగ్-2’ తీస్తున్నది సంపత్ నంది, అందుకే ఆయనలో ఈ వణుకు అంటున్నారు.

    కారణం గబ్బర్ సింగ్ ఎంత హిట్టో వేరే చెప్పక్కర్లేదు, దాంతో పవన్ కళ్యాన్ రేంజి ఎంత ఎత్తుకు వెల్లిందో అందరికి తెలుసే, దానికి తోడు ఇప్పుడు విడుదలయిన ‘ అత్తారింటికి దారేది’ తో ఇంకా అదరగొట్టాడు. అందుకే ‘గబ్బర్ సింగ్ -2’ పై ఆయన అభిమానులు ఎంత అంచనాలు పెట్టుకుంటారో తెలియంది కాదు, అంతెందుకు బాక్సాఫీసు వద్ద కూడా దాని అంచనాలు భారీగానే ఉంటాయి. అంటే ఈ రెండు సినిమాల కంటే కొంతైనా ఎక్కువ రేంజ్ లో, పవన్ ను అదరగొట్టేలా ఉండాలి, అంటే అది ఎంత కష్టమో ఊహించుకోండి, అందుకే సంపత్ నందిలో ఈ వణుకు అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood