ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 13 October 2013

    బాబు అదరగొట్టాడట...!

    Mohan Babu Raises Vishnu Doosukeltha, Mohan Babu response on Doosukeltha movie, Doosukeltha talk
    పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు మోహన్ బాబు. తన ఇద్దరు కొడుకులు విష్ణు, మనోజ్ కథానాయకులైనా తొలి అడుగుల్లో సరైన విజయాలు సాధించలేకపోయారు. వాళ్ళను ఎలాగైనా ఓ స్థాయిలో నిలబెట్టాలని తపిస్తూ వచ్చారు మోహన్ బాబు. అందుకోసం తన సొంత సంస్థలో సినిమాలు తెరకెక్కించారు. చాలాసార్లు నష్టపోయారు. అయినా మళ్ళీ సినిమాలు తీశారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. తన ఇద్దరు కొడుకులూ ఇప్పుడు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విష్ణు `దేనికైనా రెడీ` సినిమాతో ఫాంలోకి వచ్చాడు. ఇక నుంచి దూసుకేళ్లడమే మిగిలిందంటున్నాడు.

    అలాగే మనోజ్ కూడా `పోటుగాడు`గా నిరూపించుకున్నారు. తనదైన శైలిలో నటించి విజయం అందుకున్నారు. ఇద్దరు కొడుకులు సాధిస్తున్న ఫలితాలతో మోహన్ బాబు ఎంతో ఖుషీగా ఉన్నాడు. విష్ణు కథానాయకుడిగా నటించిన `దూసుకెళ్తా ` చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమాని చూసిన మోహన్ బాబు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ``విష్ణు బాబు అదరగొట్టాడు. చాలా బాగా నటించాడు. తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవుతుంది. మొత్తం 600 థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నాం`` అని మోహన్ బాబు చెప్పారు.

    Tollywood

    Bollywood

    Kollywood