ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 10 October 2013

    ఏడ్చేసిన ఎన్టీఆర్ – విషాదంలో రాంచరణ్

    ఏడ్చేసిన ఎన్టీఆర్ – విషాదంలో రాంచరణ్
    ఎన్టీఆర్ ఏడ్చేసాడు, రాంచరణ్ విషాదంలో మునిగిపోయాడు... తెల్లవారితే తను ప్రతిష్టాత్మకంగా తీసిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా విడుతలవుతుంది అన్న సంబరంలో మునిగితేలాల్సిన ఎన్టీఆర్ ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయాడు, ఉబికి వచ్చే కన్నీరును ఆపుకోలేక ఏడ్చేసాడు, ఆత్మీయుడు ఇక లేడు అన్నది చూసి  దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు.

    రియల్ స్టార్ శ్రీహరి భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పించేందుకు వెల్లిన ఎన్టీఆర్ పరిస్తితి ఇది. డైరెక్టర్ వంశీపైడిపెల్లితో కలిసి వెల్లిన ఎన్టీఆర్ శ్రీహరి పార్దీవ కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న శ్రీహరి సతీమణి శాంతిని పట్టుకుని రోదించాడు.

    రాంచరణ్ ది అదే పరిస్థితి, తండ్రి చిరంజీవితో కలిసివచ్చిన ఆయన నోరు బాదతో పెగలలేదు, నిన్న మొన్నటి వరకు జంజీర్, తూఫాన్ సినిమాల కోసం కలిసి నటించిన జ్ఞాపకాలు కళ్లముందు మెదిలాయో ఏమో పూర్తిగా అప్ సెట్ అయి విషాద వదనంతో కనిపించాడు. ఈ పరిస్తితి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలోను కనిపించింది.

    Tollywood

    Bollywood

    Kollywood