ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 11 October 2013

    ఆడోళ్ల క్లబ్ లోకి బుడ్డోడు

    Ladies Booked NTR
    టాలీవుడ్ లో ఆడవాళ్లను ఆకట్టుకున్న హీరోలు చాలా తక్కువ, ఎప్పుడో పాత కాలంటో శోభన్ బాబు ఆ క్రెడిట్ కొట్టేస్తే, అంతగా వారి మనసులు చూరగొన్న హీరోలు ఇప్పటి వరకు తెలుగుతెరపైకి రాలేదనే చెప్పవచ్చు. అయితే మహిళా ప్రేక్షకుల మన్ననలు పొందిన వారిలో నాగార్జున, ప్రభాస్ లు కొంత ముందున్నారు. వారి సినిమాలకు మహిళల రష్ మిగతావారికంటే కాస్తా ఎక్కువే.

    అయితే వీరితో పాటు ఆడోళ్ల మనసులను ఆకట్టుకునే దిశగా ఎన్టీఆర్ పోతున్నాడా అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటి వరకయితే మాస్ హీరోగానే ఆయనకు పేరుంది. అయితే ‘బృందావనం’ సినిమాతో ఎన్టీఆర్ మహిళల మనసును ఓసారి దోచుకున్నాడనుకోండి.

    ఇప్పుడు ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాతో ఎన్టీఆర్ మహిళల మనసుల్లో నిలిచిపోతారేమో అనుకుంటున్నారు. కారణం ఈ సినిమాకు థియేటర్ల వద్ద టికెట్ల కోసం ఆడవాళ్లే ఎక్కువ పోటీ పడుతున్నారట. అంటే ఆడోళ్ల క్లబ్ లోకి వెల్లి తనలో మాస్ యాంగిలే కాదు, క్లాస్ యాంగిల్ కూడా ఉంది అనిపించుకోబోతున్నాడన్న మాట ఎన్టీఆర్.

    Tollywood

    Bollywood

    Kollywood