'అత్తారింటికి దారేది' రెండు వారాల్లోనే అరవై కోట్ల షేర్ వసూలు చేసి 'రామయ్యా వస్తావయ్యా' వచ్చేలోపే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. 'రామయ్యా వస్తావయ్యా' రిలీజ్ అయింది కనుక దసరా పండక్కి 'అత్తారింటికి దారేది' వసూళ్లు బాగా తగ్గిపోతాయని అనుకున్నారు. కానీ 'రామయ్యా వస్తావయ్యా' తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో 'అత్తారింటికి దారేది' పబ్లిసిటీ సడన్‌గా పెంచేశారు. రిలీజ్ అయిన రెండు వారాల్లో ఒకే ఒక్క కొత్త ట్రెయిలర్ వదిలిన ఈ చిత్ర బృందం, 'రామయ్యా వస్తావయ్యా' రిలీజ్ అయిన మర్నాడే ఒకే రోజున మూడు ట్రెయిలర్స్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా ఇంతకాలం మీడియాకి దూరంగా ఉన్న పవన్‌కళ్యాణ్ మీడియా వాళ్లని పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అలాగే కొద్ది రోజుల క్రితం చేద్దామనుకుని మానేసిన 'థాంక్యూ ఫంక్షన్'ని కూడా సోమవారం జరపబోతున్నారు.
'రామయ్యా వస్తావయ్యా' టాక్ బాలేకపోవడంతో ఒక్కసారిగా 'అత్తారింటికి దారేది' బృందానికి ఇంకా చాలా బిజినెస్ చేసుకోవచ్చుననే ఐడియా తట్టినట్టుంది. వెంటనే పబ్లిసిటీ పెంచి పారేశారు. అసలే బ్యాడ్ టాక్‌తో సతమతమవుతున్న రామయ్యా వస్తావయ్యాకి ఇప్పుడు 'అత్తారింటికి దారేది'కి చేస్తున్న పబ్లిసిటీ కారణంగా అస్సలు ఊపిరాడ్డం లేదు.