కరీనా కపూర్‌కి మ్యారేజ్ జరిగి ఈ నెల పదహారుకి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఈ లోపే కరీనా కపూర్ కూతురి బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రికు భారీగా కసరత్తులు జరుగుతున్నాయి. అదేంటి, కరీనాకు పెళ్ళి అయితే జరిగింది కాని, పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకుంటున్నారా? ఇందులో ఆశ్యర్యపడాల్సిన అవసరం ఏమి లేదు. సైఫ్ అలీ ఖాన్‌ని పెళ్ళి చేసుకున్న కరీనా, ఆనాడే ఒక మాట ఇచ్చింది. 'మాకు పిల్లలు వద్దూ, సైఫ్‌కు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడ నా బిడ్డలతోనే సమానం. నేనూ వాళ్ళకూ తల్లినే' అని ఓ సెంటిమెంట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
దాని ప్రకారమే సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కూతరు సరా ఖాన్, కరీనాకపూర్‌కీ కూతురు అయింది. ఇప్పుడు సరా ఖాన్ వయస్సు ఇరవై సంవత్సరాలు. ఈ అమ్మడి బాలీవుడ్ ఎంట్రి కోసం పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలు కూడ క్యూ కడుతున్నాయి. సరాఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలే కాని బాలీవుడ్ కుర్ర హీరోలు సైతం ఆమెతో నటించడానికి రెడీ అవుతున్నారు. సరాఖాన్ బాలీవుడ్‌లోకి ఎప్పుడు ఎంట్రి ఇచ్చినా అది యష్‌రాజ్ ప్రొడక్షన్ నుండే అని ఖారారైంది. ఈ మధ్య కాలంలో సరాఖాన్ కొన్ని స్టోరీలను వింటుదని సమాచారం. దీంతో పటౌడి హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు, బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రి అంటూ వార్తలు షురూ అందుకున్నాయి.