లక్షకు పైగా ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు కంటున్న కల నెరవేరింది, ఎట్టకేలకు ఆర్టీసిని ప్రభుత్వం లో విలీనం చేసారు. రవాణా శాఖా మంత్రితో ఆర్టీసి సంఘాలు జరుపుతున్న చర్చలు పలించాయి. ఈమేరకు ఆర్టీసిని విలీనం చేస్తూ ప్రభుత్వం జిఓ 954 ను విడుదల చేసింది. ఇప్పటికే ఆర్టీసి వందల కోట్ల నష్టం లో ఉంది. ఇది భరించలేక ఆర్టీసి కార్మికులకు, ఉద్యోగులకు సరైన ప్రయోజనాలు దొరకడం లేదు. పైగా వేతనాలు కూడా తక్కువే.
ఆర్టీసి ని ఎలా కలపాలి, ఏంచేయాలి అన్నదానిపై అధికారులు, ఆర్టీసి కార్మికులతో ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేసారు. ఇది రెండు రోజుల్లో విలీనం జరిగితే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలి అన్న దానిపై నివేదిక ఇస్తొంది. ఈ నివేదిక ప్రకారం అంతా జరుగుతుందన్న మాట. ఇంకా కొన్ని డిమాండ్స్, సమ్మె విరమణపై శుక్రవారం సాయంత్రం మరోసారి బొత్సతో ఆర్టీసి సంఘాలు సమావేశం అయి చర్చించనున్నాయి.
ఇవి కూడా సఫలం అవుతాయనే సంకేతాలు ఆర్టీసి యూనియన్ల నేతల నుంచి వెలుబడ్డాయి. అంటే ఆర్టీసి సమ్మె కూడా విరమణ కానున్నదన్న మాట. ఇక ఆర్టీసి విలీనంతో ఇప్పడు అందులో పనిచేస్తున్న లక్షా 17 వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇక లాభం, నష్టం గూర్చి బెంగ కూడా అంతగా అవసరం లేదన్నమాట, ఎందుకంటే ఇక ప్రభుత్వమే అన్ని చూసుకుంటుంది కాబట్టి.