టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్- స్టైలిష్ సినిమాల దర్శకుడు సుకుమార్ కలయికలో వస్తున్న సినిమా '1' నేనొక్కడినే. ప్రస్తుతం దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు హలచల్ చేస్తుంది. ఇంతకీ అదేంటంటే.. ఈ సినిమా మొత్తం నిడివి 1.30 నిముషాలు మాత్రమే ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో సినిమా కూడా అంత తక్కువ టైం ఉండే సినిమా లేదు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు వచ్చే ఒకటిన్నర గంటల ఫార్ములాలో ఈ సినిమా తెరకెక్కినట్లు చెబుతున్నారు. మహేష్ బాబు కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇంతవరకు వచ్చిన స్టార్ హీరోల అన్ని సినిమాలలోనే చిన్న సినిమా అవుతుంది.
అంతేకాదు ఈ సినిమాలో కామెడీ ట్రాక్ అనేది లేదని.. సినిమా మొత్తం సీరియస్ గా ఉండబోతుందని, ప్రేక్షకులను అబ్బుర పరిచే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. మహేష్ తొలిసారి సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్న ఈ సినిమా కంప్లీట్ ఓ హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ తీసుకురావాలని సుకుమార్ తన టాలెంట్ అంతా ఉపయోగించి కష్టపడుతున్నాడట. ఇన్ని ప్రయోగాలు చేస్తున్న మహేష్-సుకుమార్ లకు సక్సెస్ రావాలని ఆశిద్దాం!