ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 27 November 2013

    భారత్ లక్ష్యం 264 పరుగులు... చేదించేనా ?

    భారత్ లక్ష్యం 264 పరుగులు... చేదించేనా
    కాన్పూర్ : భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్ లో ఐదు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. చివరిలో సామి, డిఎం బ్రేవోలు చక్కగా ఆడారు. పావెల్, శామ్యూల్ లు అర్థ సెంచరీలు సాధించారు. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. 4.5 ఓవర్ వద్ద చార్లెస్ వికెట్ ను భువనేశ్వర్ తీశాడు. అనంతరం వికెట్ పోకుండా పావెల్, శ్యామూల్ నిలకడగా ఆడారు. అడపదడప షాట్లు కొడుతూ స్కోరును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ అర్థ సెంచరీలు సాధించారు.

    వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి భారత బౌలర్లు శ్రమించారు. చివరకు పావెల్ (70), శామ్యూల్స్ (71) లను అశ్విన్ పెవిలియన్ పంపించాడు. అప్పటికి విండీస్ జట్టు స్కోరు 168 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. తరువాత వచ్చిన సిమన్స్ (13) పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో వెనుదిరిగాడు. అప్పటికీ జట్టు స్కోరు 187 పరుగులు. అనంతరం వచ్చిన డిజే బ్రేవో నాలుగు పరుగులు సాధించి వెనుదిరిగాడు. సామి, డిఎం బ్రేవోలు వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. డిఎం బ్రేవో అర్ధ సెంచరీ సాధించాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాధించాడు. బాల్స్ ను ఏమాత్రం వేస్ట్ చేయకుండా పరుగులు రాబట్టేందుకు సామి కృషి చేశాడు. 29 బాల్స్ ఆడిన సామి 37 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇందులో రెండు సిక్స్ లు, ఒక ఫోర్ ఉన్నాయి. చివరకు 50 ఓవర్ లో 5 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు 263 పరుగులు చేసింది.

    No comments:

    Post a Comment

    Tollywood

    Bollywood

    Kollywood