ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 20 November 2013

    ఐదు రోజుల్లో 3 కోట్లు వసూలుచేసిన 'విల్లా'

    ఐదు రోజుల్లో 3 కోట్లు వసూలుచేసిన విల్లా, Villa Collected 3 crores in 3 days, pizza 2 Collected 3 crores in 3 days, Pizza 2 Movie Collected 3 crores in 3 days
    హారర్- థ్రిల్లర్ గా వచ్చిన 'పిజ్జా2: విల్లా' చిత్రం పిజ్జా అంత గొప్పగా వసూళ్లు చేయలేకపోయినా.. క్రమంగా దూసుకెళ్తోంది. తమిళనాడులోనే మొదటి ఐదు రోజుల్లో ఇది 3.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే, ఈ సినిమా నిర్మాణానికి అయ్యిన మొత్తం ఖర్చే ఐదు కోట్ల రూపాయలు కావడం ఇక్కడ గమనార్హం. పిజ్జా లాంటి బీభత్సమైన ఓపెనింగులు దీనికి రాకపోవచ్చు గానీ, అయినా క్రమంగా బాక్సాఫీసులో స్థానం సంపాదిస్తోందని ట్రేడ్ ఎనలిస్టు త్రినాథ్ తెలిపారు.

    పిజ్జా సినిమా ఇటు విమర్శకుల నుంచి, అటు ప్రేక్షకుల నుంచి సమాన స్థాయిలో ఆదరణ పొందిందని, కానీ విల్లాకు మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయని అంటున్నారు. చాలామందికి సినిమా ముగింపు సరిగా అర్థం కాలేదని, సినిమా హారర్ తరహా కాబట్టి, చూసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను వాళ్లు చూడకపోయి ఉండొచ్చని త్రినాథ్ అన్నారు. అయితే క్రమంగా రెండోసారి చూసేటప్పుడు మాత్రం అన్నింటికీ కనెక్ట్ అవుతారని అన్నారు. అశోక్ సెల్వన్, సంచితా శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగులో కూడా విడుదలైంది.

    Tollywood

    Bollywood

    Kollywood