ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 18 November 2013

    సోనియాకి చిప్పకూడు తప్పదా?

    సోనియాకి చిప్పకూడు తప్పదా, Sonia Gandhi in Jail, Sonia in Jail, Sonia Gandhi going to Jail
    ఈరోజుల్లో రాజకీయ నాయకులు జైళ్ళలో మగ్గడం అనేది మామూలు విషయంగా మారింది. కాలం కలిసొచ్చినంత వరకూ దర్జా వెలగబెట్టినా, బ్యాడ్ టైమ్ రాగానే జైలుకి మకాం మార్చిన రాజకీయ నాయకులు ఇటీవలి కాలంలో చాలామంది వున్నారు. ఇప్పుడు భారతదేశ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న ఇటలీ వనిత సోనియాగాంధీ భవిష్యత్తులో జైల్లో కాలక్షేపం చెయ్యక తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ వాదన వినిపిస్తోంది ఎవరో కాదు. సంచలన వ్యాఖ్యలతో, కేసులతో తన రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించే అభినవ చాణక్యుడు సుబ్రహ్మణ్యస్వామి.

    ఆయన తాజాగా సోనియాగాంధీతో పాటు తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుల మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సోనియాగాంధీని ఆయన టార్గెట్ చేశారు. ఒకప్పుడు సోనియా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో వుండేదట. ఇప్పుడా బ్యాలెన్స్ రెండు లక్షల కోట్లకు చేరుకుందట. ఆ సొమ్మంతా కుంభకోణాల ముడుపుల ద్వారా సమకూరినదేనట! టూజీ కుంభకోణంలో సోనియాకి 25 వేల కోట్లు, కరుణానిధికి 16 వేల కోట్లు, చిదంబరానికి 5 వేల కోట్లు ముడుపులుగా దక్కాయట! మొత్తమ్మీద ఈ కుంభకోణంలో 60 వేల కోట్లు చేతులు మారాయట! ఎన్డీయే అధికారంలోకి రాగానే ఈ ముగ్గుర్నీ జైలుకు పంపించడం ఖాయమట!

    సుబ్రహ్మణ్యస్వామి అన్న ఈ మాటలన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. గతంలో ఆయనకి ఎంతో మంది రాజకీయ నాయకుల రాజకీయ భవిష్యత్తును సమాధి చేయడంతోపాటు, ఉద్ధండపిండాల్లాంటి ఎంతోమంది రాజకీయ నాయకుల చేత చిప్పకూడు తినిపించిన చరిత్ర వుంది. తన ప్రత్యర్థులకు సంబంధించిన రహస్యాల గుట్టమట్లను బయటకి లాగి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి శిక్షలు వేయించడంలో ఆయనకు ఆయనే సాటి. అన్నంతపనీ చేసే పట్టువదలని విక్రమార్కుడు సుబ్రహ్మణ్యస్వామి నోటి వెంట తమ అధినేత్రి గురించి ఇలాంటి మాటలు రావడం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఆందోళనపడి ఉపయోగం ఏముంటుంది.. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవా అని ఊరకే అన్నారా?!

    Tollywood

    Bollywood

    Kollywood