ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 18 November 2013

    ఫ్రీ గా నటిస్తా అంటున్న వెంకీ

    ఫ్రీ గా నటిస్తా అంటున్న వెంకీ
    హీరోల రెమ్యునరేషన్ కోట్లలో ఉంటోంది. సినిమా బడ్జెట్లో హీరో తీసుకునే మొత్తం పెద్ద భాగమే. అలాంటిది ఓ హీరో నేను ఫ్రీగా సినిమా చేస్తాను అంటే నిర్మాతలు ఎగిరి గంతేస్తారు. కానీ అదేంటో... అలా జరగడం లేదు.

    ఓ సీనియర్ హీరో, అది కూడా పాపులారిటీ బాగానే ఉన్నవాడు అంత ఆఫర్ ఇచ్చినా ఎవరూ దాన్ని ఉపయోగించుకోవడం లేదు.   ఇంతకీ ఆ హీరో ఎవరనేగా? ఇంకెవరు... విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ చిత్రాలు, కామెడీ చిత్రాలతో అందరినీ అలరించే వెంకటేష్ కి తొలిసారి ఓ పెద్ద ప్రయోగం చేయాలనిపించింది. తనకు ఎంతో ఇష్టమైన, ఆరాధ్యుడైన వివేకానందుడి పాత్రలో మెరవాలని ఆశ పుట్టింది. ఆ ఆశను మనసులోనే దాచేసుకోకుండా బయట పెట్టేశాడు.

    స్వామి వివేకానందుడి జీవితం ఆధారంగా సినిమా తీస్తే, తాను ఒక్క పైసా రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా నటిస్తానని మాట కూడా ఇచ్చాడు. అతడలా అనగానే అందరూ హడావుడి చేశారు. మేం చేస్తాం, మేం చేస్తాం అంటూ కొందరు ఎగబడ్డారు కూడా.

    చివరకు మణిశంకర్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుందని వార్త కూడా వచ్చేసింది.   అయితే ఏమయ్యిందో ఏమో, ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మళ్లీ దాని ఊసే వినిపించలేదు. ఎవరో ఒకరు తీయకపోతారా అని చూసిన వెంకీ ఆశ నిరాశే అయ్యింది. దాంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మళ్లీ దాని ఊసెత్తాడు.

    వివేకానంద తీయడం, నేను ఫ్రీగా చేస్తాను అంటూ పాత ఆఫర్ నే మళ్లీ కొత్తగా ఇచ్చాడు. అబ్బే... పెద్దగా స్పందన లేదు. ఇంతవరకూ ఎవరూ కూడా మేం తీస్తామంటూ ముందుకు రాలేదు. దాంతో వెంకీ ఆశ నెరవేరే అవకాశమే కనిపించడం లేదు.   సాధారణంగా ఇలాంటి ప్రయోగాలు నాగార్జున చేస్తాడు. అన్నమయ్య, రామదాసు, సాయిబాబా పాత్రల్ని పోషించాడు నాగ్. ఆదిశంకర చిత్రంలో ఛండాలుడిగా కూడా చేశాడు.

    తను కూడా అలా డిఫరెంట్ గా కనిపించాలని ఆశించినట్టున్నాడు వెంకటేష్. మరి ఎవరూ ఎందుకు ముందుకొచ్చి అతడి ఆఫర్ ని స్వీకరించడం లేదో అర్థం కావడం లేదు. ఆ పాత్రలో అతడిని ఊహించలేకపోతున్నారా లేక మార్కెట్ అంత గొప్పగా లేనందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకని వెనకడుగు వేస్తున్నారా?

    Tollywood

    Bollywood

    Kollywood