వైవిధ్య దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా ఎవరూ మరిచిపోలేరు. మంచి కాఫీ లాంటి సినిమా అయిన ఈ సినిమాలో నటించిన రాజా ఆ సినిమా తర్వాత చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఫలించలేదు. ఆ మధ్య ఓ సినిమా విషయంలో తన సినిమా థియేటర్స్ నుండి తీసేసి ఓ పెద్ద సినిమాను ఆడించారని కూడా చాలా రాద్దాంత చేశాడు.
ఇక ఆ తర్వాత రాజా పెద్దగా ఎక్కడా కనిపించకపోగా ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఉన్నాడు. ఇక మనోడి రాజకీయం గురించి చెప్పాలంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి అభిమానినంటూ వైకాపాలో చేరిపోయాడు. అంతేకాదు పార్టీ కోసం పని చేస్తానని కూడా చెప్పాడు. ఇక స్వయానా క్రిస్టియన్ అయిన రాజా క్రిస్టియానిటీ ప్రచారంలో ప్రస్తుతం చాల ఉత్సాహంగా పాల్గొంటున్నాడు.
అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఓ రాజకీయ పార్టీని స్థాపించాలని పూనుకుంటున్నాడట. ఈ మధ్యన ఓ క్రిస్టియానిటీ సభలో పాల్గొన్న రాజా దేశంలో క్రిస్టియన్ల కోసం ఓ రాజకీయ పార్టీ పెట్టి అందరినీ ఒక తాటిపైకి తేవాలని లేకపొతే నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే మతమార్పిడిని నిషేధించే అవకాశం ఉందని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది నటీనటులు పార్టీలను స్థాపించగా అందులో ఒక్క శాతం మాత్రమే సక్సెస్ అయ్యారు. అయితే సినిమా జీవితంలో కూడా సక్సెస్ కాలేని రాజా పార్టీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో మరోలా చెప్పాలా!