తెలుగమ్మాయి, హీరోయిన్ అంజలి ఏ ముహూర్తాన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిందో కానీ తన రియల్ లైఫ్ లో సినిమా కష్టాలు తప్పడం లేదు. తమిళ దర్శకుడు కళంజియం, పిన్ని భారతి లతో, కోర్టు వివాదాలతో వచ్చిన సినిమా చాన్సులు పక్కన పెట్టి " మిస్సింగ్ డ్రామా " తో అసలుకే ఎసరు తెచ్చుకుందని అంటున్నారు. బలుపు మూవీ తనకు ఎలాంటి హెల్ప్ అవకపోగా హై రెమ్యునరేషన్ కోట్ చేసి రెండు పెద్ద సినిమాలనూ మిస్ చేసుకుంది. లేటెస్ట్ మసాలా సినిమాలో అంజలి లుక్ లోనూ కళ తప్పి సినిమాకు రాంగ్ చాయిస్ అనిపించుకుంది.
ఇక టాలీవుడ్ లో ఎలాంటి ఆఫర్స్ లేకపోగా తమిళ్ లోనూ రిలీజ్ పెండింగ్ లో ఉన్న విశాల్ - మదగజరాజా , గెస్ట్ రోల్ చేస్తున్న లారెన్స్ - ముని 3 తప్ప డైరీ ఖాళీగానే ఉన్నట్టు టాక్. ఇపుడైనా కోర్టు కేసులు వదుల్చుకొని " సీక్రెట్ అఫైర్ " కు గుడ్ బై చెబితే అంజలి కోసం కొన్ని రోల్స్ రెడీగా ఉన్నాయని వినిపిస్తోంది.