నందమూరి బాలకృష్ణ ఉగ్రరూపం దాల్చాడు. బ్రహ్మానందాన్ని ఆడేసుకొన్నాడు..! ఇది సినిమాలో సీన్ కాదు. నిజంగానే నిజం. వివరాల్లోకి వెళ్తే... బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లెజెండ్. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. ఇటీవల బాలకృష్ణ, బ్రహ్మానందంలపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారట. ఈ సమయంలో బ్రహ్మీ సెట్ కి ఆలస్యంగా వచ్చాడట. అంతేకాదు.. ఎంత సేపటికీ సీన్ ఒకే చేయడంలో విఫలం అయ్యాడట. దాంతో.. బాలయ్యకు కోపం వచ్చేసింది. సెట్లో అందరిముందూ.. బ్రహ్మీకి సీరియస్ గా క్లాస్ పీకేశాడట. సెట్లో ఎవరి పనిలోనూ కలుగు చేసుకోని బాలయ్య.... బ్రహ్మానందంపై ఇలా విరుచుకుపడడం కలకలం రేపింది. యూనిట్ యూనిట్ అంతా డంగైపోయింది. బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్నే... ఆడేసుకొన్నాడంటే, మిగిలిన వాళ్లను ఊరుకొంటాడా?? అందుకే అప్పటి నుంచీ బాలయ్య ముందు వెర్రి వేషాలు వేయడానికేకాదు.. ఖాళీగా నిలబడడానికి కూడా యూనిట్ అంతా భయపడుతోందట. పాపం బ్రహ్మీ... ఈ షాక్ నుంచి తేరుకొన్నాడో లోడో..?
Tuesday, 26 November 2013
Tollywood