ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకొని రాంగోపాల్ వర్మసంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తుంటాడు. నిజానికి వర్మ ఏం మాట్లాడినా అందులో సంచలనం ఉండి తీరుతుంది. అదో పబ్లిసిటీ ట్రిక్కు. ఈసారి వర్మపైనే అలాంటి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారొకరు. ప్రముఖ బాలీవుడ్ నటి, గాయని సుచిత్రా కృష్ణ మూర్తి ‘డ్రామా క్వీన్’ అనే పుస్తకం రాశారు. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారం ఈ పుస్తకం. గతంలో సుచిత్ర... రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘మై వైఫ్స్ మర్డర్’ ,రన్ వంటి పలు చిత్రాల్లో నటించింది.
ఆ పుస్తకంలో వర్మ, సుచిత్ర కు సంభదించి ఓ వ్యక్తిగత విషయం వుంది. ఓ సారి సుచిత్రా రామ్ గోపాల్ వర్మను నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగిందట. దానికి వర్మ సమాధానం ఇస్తూ... ‘సుచిత్రా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. మన ఆలోచనలు, దృక్ఫథాలు ఒక్కటి కావు, ఎప్పటికీ కాలేవు. నాకు వివాహ బంధంపై నమ్మకం లేదు. నేను మహిళలను కేవలం సెక్స్ కోసమే ఉపయోగించుకుంటాను. నేను కేవలం మహిళల శరీరాలనే ఇష్టపడతాను వారి మెదడును కాదు’ అని నిర్మొహమాటంగా చెప్పేశాడట. దాంతోసుచిత్ర షాక్ తిందట. అయితే వర్మ ఇంత నిర్భయంగా చెప్పడంతో ఆయన్ని మరింతగా అభిమానించిందట.
తమ మధ్య జరిగిన ఈ విషయాన్ని... వర్మ అంగీకారంతోనే పుస్తకంలో చేర్చింది సుచిత్ర. ఇంకా ఈ పుస్తకంలో ఇలాంటి షాకింగ్ అంశాలు చాలానే ఉన్నాయి. వర్మ ఒక్కడే అనుకొంటే....అలాంటి వాళ్లు చాలామందే తయారయ్యాన్నమాట.