చేతిలో సినిమాల్లేవు. అందులోనూ ఐరెన్ లెగ్ అనే అపప్రద మూటగట్టుకొంది తాప్సి. తెలుగులో ఇక తాప్సి కెరీర్ క్లోజ్ అనుకొంటున్న తరుణంలో ఓ భారీ ఆఫర్ అందుకోగలిగింది. ఔను.. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో తాప్సికి ఆఫర్ దక్కింది. మహేష్ – శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం ఆగడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తమన్నా ఓకథానాయిక. ఈ సినిమాలో రెండో నాయిక కూడా ఉందట. ఆ స్థానం కోసం తాప్సి పేరు పరిశీలిస్తున్నారని సమాచారమ్. ఆమె ఎంట్రీ దాదాపు ఖాయమైనట్టే. కానీ చిత్రబృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈలోగా తాప్సి ఎంపిక ఖరారు చేస్తారేమో చూడాలి.