ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ మన భాగ్యనగరానికి విచ్చేస్తున్నాడు. అదీ ఓ సినిమా కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడానికి. శేఖర్ కమ్ముల శిష్యుడు తుమ్మ కిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం దిల్ దివానా. ఈనెల 20న ఈ చిత్రంలోని గీతాల్ని ఆవిష్కరించనున్నారు. ఈకార్యక్రమానికి మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ముఖ్య అతిథిగా వచ్చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ధృవీకరించింది. ''కపిల్ మా కార్యక్రమానికి రావడానికి అంగీకరించారు. ఆయనకు కృతజ్ఞతలు'' అని దర్శకుడు చెబుతున్నారు. ఈ సినిమాకీ, కపిల్ దేవ్‌కీ ఉన్న సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. నూతన నటీనటులు నటించిన ఈ చిత్రానికి రామ్ నారాయణ సంగీతం అందించారు.
Monday, 18 November 2013
Tollywood
