ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 25 November 2013

    దీపికా ఉంటే ఆ కిక్కే వేరంటా...!!

    దీపికా ఉంటే ఆ కిక్కే వేరంటా...
    దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తెలివైనవాళ్ల లక్షణం అంటారు పెద్దలు. బాలీవుడ్ చిన్నది దీపికా పదుకొనే పెద్దల మాటలను అక్షరాలా ఫాలో అయిపోతుందేమో. ప్రస్తుతం టైమ్‌ని క్యాష్ చేసుకునే పని మీద ఉందట. కాక్‌టైల్, రేస్ 2, ఏ జవానీ హై దివానీ, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, రామ్‌లీలా.. ఇలా వరుసగా ఐదు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామకు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ‘అందచందాల్లో మాత్రమే కాదు... అభినయంలోనూ దీపికా సూపర్’ అని బాలీవుడ్‌వారు తెగ కితాబులిచ్చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో భారీ నిర్మాతలు, దర్శకులకు దీపికా ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ అయిపోయింది.

    తమ సినిమాలో దీపికా ఉంటే ఆ కిక్కే వేరని, తను చాలా లక్కీగాళ్ అని కూడా కొంతమంది బలంగా ఫిక్స్ అయ్యారట. ఫలితంగా దీపికా పారితోషికం అమాంతంగా పెరిగిందని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం ‘కోట్’ చేస్తున్న తార దీపికాయేనట. నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని వినికిడి. ఒక్కసారిగా లైఫ్ ఇంత మంచి టర్నింగ్ తీసుకున్నందుకు దీపికా తెగ ఆనందపడిపోతోంది. ‘యజమానికి గర్వం... పొరుగువారికి అసూయ’... అనే ఓ టీవీ కంపెనీ ప్రకటన తరహాలో... దీపికా వైభవానికి ఇతర నాయికలు కుళ్లుకుంటున్నారట. కానీ, ఇదేం పట్టించుకునే స్థితిలో లేని దీపికా.. ‘‘అవకాశాల గురించి ఆలోచించాల్సిన పని లేకుండాపోయింది. ఇప్పుడు నాక్కావల్సిందల్లా నా కుటుంబంతో గడపడానికి కొంత సమయం’’ అంటోంది.

    Tollywood

    Bollywood

    Kollywood