టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరగరాని సంఘటన ఒకటి జరిగింది. ఓ జూనియర్ ఆర్టిస్ట్‌పై రేప్ అటెంప్ట్ జరిగింది. చేసింది కూడ ఫిల్మ్ ఇండస్ట్రీకు సంబంధించిన వ్వక్తే కావడంతో ఇది చర్ఛనీయాంశంగా మారింది. సినిమాల ద్వార సమాజంలో జరిగే చెడును కడిగిపారేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఈ తరహా ఘటన జరగటం అందరిని విస్మయానికి గురిచేసింది. వివరాలలోకి వెళితే, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెట్టింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ అనే వ్వక్తి, జానియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారానికి పాల్పడినట్టు టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం. ఈ ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిది కిందకు వచ్చే రెహమత్‌నగర్ ఏరియాలో చోటుచేసుకుంది. బాధితురాలు జాబ్లి హిల్ష్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదు చేసింది. నిర్భయ చట్టం క్రింత అత్యాచారానికి పాల్పడ్డ వ్వక్తిపై కేసు నమోదు అయింది. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువంటి సంఘటనలు జరగటం చాలా అరుదు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడ టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సేకరిస్తుంది. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రతి సంవత్సరం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్‌ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాని వాళ్ళకు మాత్రం సరైన అవకాశాలు దొరకటంలేదు. దీపిపై తగు చర్యలను తీసుకోవటంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంత జాగ్రత్తలు వహించినా, ఉపాధి కొరత మాత్రం ఇంకా తీరడంలేదు.