ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Tuesday, 3 December 2013

సోనియా ఆస్తి 12,400 కోట్లు..!

సోనియా ఆస్తి 12,400 కోట్లు..!
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్తుల విలువ రూ.12,400 కోట్లకు పైనే ఉందని అమెరికాకు చెందిన హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్ అనే వెబ్ సైట్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న 20 మంది అత్యంత సంపన్నులైన నేతలతో ఓ జాబితా రూపొందించామని తెలిపింది. ఈ జాబితాలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ 12వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇందులో స్థానం దక్కకపోవటం విశేషం.
సోనియా ఆస్తి 12,400 కోట్లు..!
సెలబ్రిటీ నెట్ వర్క్ డాట్ కామ్ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితా రూపొందిచినట్లు తెలుస్తోంది.ఈ వివాదాస్పదమైన వెబ్ సైట్ ను 2009 అక్టోబరులో లాస్ ఏంజెల్స్ లో ప్రారంభించారు. 2009 నాటి ఎన్నికల సమయంలో సోనియాగాంధీ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ రు.1.38 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఆమెకు సొంత వాహనం కానీ, సొంత ఇల్లు కానీ లేదని వెల్లడించారు. 75 వేల నగదు, బ్యాంక్‌ డిపాజిట్ల రూపంలో 28 లక్షలా 61 వేల రూపాయలున్నాయని ప్రకటించారు. తాజా సర్వేతో ఆమె గతంలో ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తుల వివరాలు సైతం ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి.

Post Comments

No comments:

Post a Comment