సినిమాల మీద మోజుతో అవకాశాల కోసం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులపై రోజూ ఎక్కడో ఓ చోట ఏదో ఓ ఘోరం జరుగుతూనే ఉంది. ఇలాంటి వాటిపై ఫిలిం ఇండస్ట్రీ చర్యలు తీసుకొంటుందా? తప్పు చేసిన వారికి శాశ్వత బహిష్కరణ వేటు వేస్తారా? అంతంత మాత్రం ఉన్న చట్టాలతో వీరు చేసేదేమిటి? అసలు ఇండస్ట్రీలోకి వచ్చే నటిమణులకు రక్షణ కరువైందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. రీసెంట్ గా హీరోయిన్ పై జరిగిన అత్యచారమే ఇందుకు ఉదాహరణ. అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం తోటి ఆర్టిస్టులతో కలిసి అరకులో షూటింగ్ బయలుదేరి వెళ్ళిన హీరోయిన్ పై అత్యాచారం జరిగింది. తోటి హీరోయిన్ పై బరితెగించింది సినిమాకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కావటం విశేషం.
అసలు విషయంలోకి వెళ్తే... ఈ ఘటన జరిగిన ప్రాంతం అరకుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో వుంది. షూటింగ్ కి ప్యాకప్ చెప్పడంతో... ఆ వెంటనే అందరూ కలిసి అరకుకు బయలుదేరారు. సినిమా యూనిట్ అందరికి అరకులో ఓ హోటల్లో బస ఏర్పాటు చేసారు. హీరోయిన్ గదిలోకి రాత్రి రెండున్నర గంటల సమయంలో ఒక వ్యక్తి వెళ్ళాడు. అరిస్తే చంపేస్తా... నేను చెప్పినట్లు వినూ... లేకపోతే చంపేస్తా అంటూ సదరు హీరోయిన్ ను బెదిరించాడు. గట్టిగా కేకలు వేస్తూ ఆతని నుండి తప్పించుకుని ఎలాగోలా బయట పడింది. బలవంతంగా ఆ హీరోయిన్ పై అగాయిత్యానికి ఒడిగట్టింది సినిమా యూనిట్ లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ కావటంతో షాక్ తిన్న ఆ హీరోయిన్... జరిగిన విషయాన్నీ దర్శకుడికి చెప్పింది. దాంతో అక్కడున్న వారు అతనిని పట్టుకొని దేహశుద్ధి చేసారు.
మారుతి పుణ్యమా అని చిన్న సినిమాలకు డిమాండ్ పెరగడంతో అందరు చిన్న సినిమాల వైపు ఆకర్షితులవ్వటంతో నటి నటులకి కూడా డిమాండ్ బాగానే పెరిగింది. ఈ చిత్ర నిర్మాత గతంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి నాలుగు డబ్బులు కూడబెట్టుకుని, ఇప్పుడు అయన దృష్టి సినిమాల వైపు మళ్ళింది. ఈ ఘటనలో గాయపడిన హీరోయిన్ సినిమా యూనిట్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ ఉంటున్న హోటల్ గది తలుపు సరిగా లేకపోవడమే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. అత్యాచారం జరిగిన హోటల్ ను పోలీసులు చెక్ చేశారు. నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి గురైన బాధితురాలు ఐదేళ్ళ కిందట సొంతూరు పాలకొల్లు నుండి వచ్చి హైదరాబాద్లో సెటిలయ్యింది. ఈమె అంతకు ముందు కొన్ని టీవీ చానల్స్ లో యాంకర్ గా కూడా పని చేసింది. హీరోయిన్ గా అవకాశం రావటంతో సినిమాలలో నటించటం మొదలు పెట్టింది.

No comments:
Post a Comment