మహేష్ తాజా సినిమా 1 నేనొక్కడినే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్స్ హక్కులతో పాటు డిస్టిబ్యుషన్ హక్కులు కూడా అమ్ముడై పోయాయని.. అది కూడా బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుందని ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
బాలీవుడ్ లో బాగా ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకి సంబందించిన ఫుల్ రైట్స్ ని ఓ భారీ మొత్తానికి కొనుక్కున్నారట. ఈ డీల్ తో ఈ సినిమాకి సంబందించిన అన్ని హక్కులు ఈరోస్ కే చెందుతాయి. అయితే, ఎన్ని కోట్లకు ఈ డీల్ జరిగిందన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.
కాగా డిసెంబర్ 22 న జరపనున్న ఆడియో వేడుకను అన్ని తెలుగు ఛానెల్స్ లో ఒకేసారి టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేయడంతో పాటు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు, టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెస్తున్నట్లు వినికిడి. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు...

No comments:
Post a Comment