ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 3 December 2013

    రమ్యకు చుక్కలు చూపించిన బీజేపి

    Mp Ramya Paid 4 crs Fine, 29 ఏళ్లే రాజకీయ నటికి చుక్కలు చూపించిన యంగ్ హీరో, రమ్యకు చుక్కలు చూపించిన బీజేపి
    29 ఏళ్లకే.. రాజకీయలోకి ప్రవేశించి, ఎంపీ సీటు సొంతం చేసుకుంది.. కన్నడ హీరోయిన్ రమ్య. సినిమాలో బిజీగా ఉన్న నటి రమ్య ఒక్కసారిగా.. లోక్ సభ సభ్యురాలుగా మారిపోయింది ఈ అమ్మడు. అయితే అమ్మడు రాజకీయల్లోకి చేరటంతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది నిర్మాతలు, చాలా నష్టపోయినట్లు సమాచారం. అవును రమ్య రాజకీయాల్లోకి వస్తే.. సినీ నిర్మాతలు , హీరోలు ఎందుకు నష్టపోయారు. అంటే రమ్య రాజకీయల్లోకి రాకముందు.. కొన్ని సినిమాల్లో నటిస్తుంది. అనుకోకుండా రాజకీయ అధ్రుష్టం దక్కటంతో.. ఆమె సినిమా షూటింగులకు దూరమైంది. దీంతో సదరు నిర్మాతల సినిమాలు మద్యలోని ఆగిపోవటం జరిగింది.

    అయితే విషయం తెలుసుకున్న ఒక యంగ్ హీరో రంగంలోకి దిగి, ఎంపీ రమ్యకు పట్టపగలే చుక్కలు కనిపించేలా చేసినట్లు సీని వర్గాలు అంటున్నాయి. అసలు కథ ఏమిటంటే.. రమ్య ‘నీర్ దేస్ ’ అనే సినిమాలో నటిస్తూ.. రాజకీయల్లోకి వెళ్లిపోవటం జరిగింది. అయితే అదే సినిమాలో హీరోగా నటిస్తున్న జగ్గేష్ ఎంపీ రమ్య పై మండిపడినట్లు తెలుస్తోంది. రమ్య ప్రవర్తన అనైతికం అంటూ ఆమె కు కొన్ని నోటీసులు పంపించాడు. నీర్ దేస్ అనే సినిమా దాదాపు 60 శాతం పూర్తయింది. మీరు రాజకీయల్లోకి వెళ్లటంతో.. ఈ సినిమా మద్యలోని ఆగిపోవటం జరిగింది. దీంతో సదరు నిర్మాత పూర్తిగా నష్టపోయాడు కాబట్టి మీరు నిర్మాతకు .. 4 కోట్లు కట్టాలని కన్నడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు నిర్మాత చేత పిర్యాదు చేయించాడు. వెంటనే రమ్య పై కన్నడ మీడియాలో హాట్ న్యూస్ అంటూ మీడియా వారు సందడి చేశారు.

    దీంతో నటి రమ్య దిగి వచ్చి, తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల , షూటింగ్ కు రాలేకపోయను కాబట్టి నేను ఫైన్ కడతానంటూ ఎంపీ రమ్య రాజీకి వచ్చినట్లు సమాచారం. అయితే ఇలా రమ్యకు పట్టపగలే చుక్కలు చూపించటానికి కారణం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న హీరో జగ్గేష్ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన రమ్య కు చుక్కలు చూపించాడని కన్నడ ఫిలిం వర్గాలు అంటున్నాయి.

    No comments:

    Post a Comment

    Tollywood

    Bollywood

    Kollywood