ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 6 December 2013

    నిప్పు లేనిదే పొగ రాదు కదా!

    hansika, Simbu, Wrong Person, రాంగ్ పర్సన్‌, హన్సిక, శింబు
    ‘‘ప్రేమ చాలా మధురమైనది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడాలి’’ అన్నారు హన్సిక. ఆ అనుభూతిని హన్సిక అనుభవించిన విషయం అందరికీ తెలిసిందే. తమిళ హీరో శింబూతో తన ప్రేమాయణాన్ని ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి చెప్పారు హన్సిక. ఈ బ్యూటీ ప్రకటించిన రోజునే శింబు కూడా హన్సికతో తన ప్రేమను బహిర్గతం చేశారు. ఈ ప్రేమ పెళ్లి వరకు వెళుతుందని చాలామంది ఊహించారు. అయితే అంతవరకు వెళ్లకుండానే శింబు, హన్సికల ప్రేమకు ఫుల్‌స్టాప్ పడిందనే వార్త ప్రచారంలో ఉంది. ఈ బ్రేకప్ నిజమేనా? అని హన్సిక దగ్గర "ఇ24తెలుగు.కామ్" ప్రస్తావించగా - ‘‘బ్రేకప్ అయ్యాం అని అందరూ ప్రచారం చేస్తున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు కదా.
    hansika, Simbu, Wrong Person, రాంగ్ పర్సన్‌, హన్సిక, శింబు
    దీన్నిబట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. కారణాలను విపులంగా ఎందుకు చెప్పడంలేదంటే.. అవతలి వ్యక్తంటే నాకు గౌరవమే. అతనికీ కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని నేను గౌరవించాలిగా’’ అని చెప్పారు. రాంగ్ పర్సన్‌ని సెలక్ట్ చేసుకున్నామనే ఫీలింగ్ ఉందా? అన్న ప్రశ్నకు -‘‘ఈ ప్రపంచంలో ఎవరూ రాంగ్ కాదు.. ఎవరూ కరెక్ట్ కాదు. మంచీ చెడుకి కారణం సందర్భం, టైమ్ కారణం’’ అన్నారు. శింబూతో నయనతార సినిమా చేయడమే ఈ బ్రేకప్‌కి కారణం అనే టాక్ ఉందనే ప్రశ్నకు సమాధానంగా -‘‘నేను అతనితో మాట్లాడి కొన్ని నెలలయ్యింది.

     దీని గురించి ఏమీ కామెంట్ చేయలేను’’ అన్నారు హన్సిక. భవిష్యత్తులో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా? అని హన్సికను అడిగితే -‘‘అలాంటిదేం లేదు. నేను చాలా పాజిటివ్ పర్సన్‌ని. ఒకవేళ నా ఆరోగ్యం బాగాలేక ఐసియులో అడ్మిట్ అయ్యాననుకోండి. చికిత్స పూర్తి చేసుకుని బయటికొచ్చిన తర్వాత ‘థాంక్ గాడ్. మస్త్ ఎక్స్‌పీరియన్స్’ అంటాను. సో.. దేన్నయినా ఓ మంచి ఎక్స్‌పీరియన్స్‌గానే భావిస్తాను’’ అన్నారు.

    No comments:

    Post a Comment

    Tollywood

    Bollywood

    Kollywood