ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Sunday, 19 January 2014

టీ అమ్మేవాడిని చూసి భయపడుతున్నారు !

టీ అమ్మేవాడిని చూసి భయపడుతున్నారు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, యూపీఏ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. టీ అమ్మే వ్యక్తితో పోటీ పడేందుకు కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని విమర్శించారు. న్యూఢిల్లీలో మూడవ రోజు జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ ప్రసంగించిన మోడీ కాంగ్రెస్ ను ఏకిపారేశారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎన్నడూలేని విధంగా అవినీతి జరిగిందన్న మోడీ ఆ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం, అధిక ధరలతో దేశ ప్రజలు అల్లాడుతున్నారన్నారు. దేశంలో ప్రస్తుతం సరైన నాయకత్వం లేదని, అసమర్థ పాలనతో యూపీఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నెట్టుకొస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్లిచ్చారు. నాకు 6 నెలల సమయం ఇవ్వండి. దేశ గతిని మారుస్తా’నని ప్రజలకు పిలుపు నిచ్చారు.

ప్రధాని అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ వెనకడుగు వేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అపజయం దిశగా పయనిస్తుందని, అందుకే కుమారుడు రాహుల్ ను సోనియా బలిపీఠంపై కూర్చొబెట్టలేదని అన్నారు.

Post Comments

No comments:

Post a Comment