ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 11 May 2013

    రౌడీలంటే రామ్ గోపాల్ వ‌ర్మకు అంతిష్టమా?

    రౌడీలంటే రామ్ గోపాల్ వ‌ర్మకు అంతిష్టమా?
    బెజ‌వాడ రౌడీలు సినిమా తీసి.. సంచ‌ల‌నం సృష్టించాల‌ని చూసిన వ‌ర్మకి గ‌ర్వ భంగం ఎదురైంది. ఆ సినిమాని ఎవ్వరూ ప‌ట్టించుకోలేదు. అయినా స‌రే.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుడిలా రౌడీయిజంపైనే మ‌రో క‌థ అల్లుకొన్నాడు. అదే ‘స‌త్య‌’. శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడు. ఈ చిత్రానికి వ‌ర్మస్వయంగా ద‌ర్శక‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ప్రచార చిత్రాలు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ లో విడుద‌ల‌య్యాయి. ఈ సంద‌ర్భంగా వ‌ర్మ.. రౌడీయిజాన్ని వెన‌కేసుకొచ్చాడు. దానికి చావు లేద‌ట‌. ఏదో ఓ రూపంలో పుట్టుకొస్తూనే ఉంద‌ట‌. మాఫియా లీడర్లంతా నయా సాంకేతిక పరిజ్ఞానం ఉప‌యోగిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించ‌బోతున్నాడట‌. రౌడీయిజంపై ఈ ద‌ర్శకుడికి అంత మ‌క్కువ ఏమిటో మ‌రి??

    Tollywood

    Bollywood

    Kollywood