ఎంత పెట్టాం? అన్నది కాదన్నయ్యా ముఖ్యం. సినిమా ఆడిందా.? లేదా?? – అనేదే చూస్తారు ప్రేక్షకులు. అయినా దర్శకులు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. భారీదనం కోసమో, గొప్పగా చెప్పుకోవడం కోసమో తెగ ఖర్చు పెట్టేస్తున్నారు. చిన్న సినిమానే అనుకొంటాం. కానీ బడ్జెట్ వింటే మాత్రం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ‘సుకుమారుడు’ విషయంలోనూ అదే జరిగింది. ఆ మాత్రం కథకు.. ఆయన ఖర్చు పెట్టించింది ఎంతో తెలుసా..? అక్షరాలా రూ13 కోట్లు. ఏ ధైర్యం చూసుకొని నిర్మాతలు అంత బడ్జెట్ కేటాయించారో మరి! సినిమా అంతా పల్లెటూర్లో తీశారు. పాటలు మాత్రం ఫారెన్ లో వేసుకొన్నారు. భారీ పారితోషికాలు తీసుకెళ్లిపోయే స్టార్లూ ఎవరూ లేరు. ఆది, అశోక్ లను చూసుకొని అంత ఖర్చు పెట్టారంటే ఏమనాలి?? చిన్న సినిమాలే ఈ రేంజ్ లో ఖర్చుపెడుతుంటే పెద్ద సినిమాలు రూ. 50 కోట్లు తగలేస్తే తప్పేం లేదు.

