టిడిపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి కడియం శ్రీహరిపై టిడిపి సీనియర్ నేత, నరసంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి విరుచుకుపడుతూనే ఉన్నారు. కడియం శ్రీహరిని రాజకీయ వ్యభిచారి అని రేవూరి విమర్శించగా, దానికి అర్థమేమిటో చెప్పాలని డిమాండు చేశారు రేవూరికి కడియం.
దీనిపై స్పందించిన రేవూరి, కడియం ప్రశ్నకు సమాధానం ఇస్తూ, పార్టీలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీని విమర్శిస్తే దానిని రాజకీయ వ్యభిచారం అనకుండా ఇంకేం అనాలని ఎదురు ప్రశ్నించారు. కడియం శ్రీహరికి మతి భ్రమించిందని, తెలంగాణపై చిత్తశుద్ది ఉంటే జెఎసితో కలిసి పోరాడాలని, అలా కాకుండా ఫామ్ హౌస్‌లో కెసిఆర్ తో బేరసారాలు చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేస్తామని, అప్పటిదాకా కడియం వేరే పార్టీలో చేరకుండా ఉండాలన్నారు రేవూరి.