ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పబ్లిసిటి పిచ్చి పట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి అమ్మ హస్తాన్ని కాస్త కక్కుర్తి హస్తంలా తయారు చేసారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ ఒక అరకొర హస్తం, ఇంకా చెప్పాలంటే అదొక మొండి హస్తమని ఆయన అభివర్ణించారు.
కమీషన్ల కోసం నేతలు తమ ముఖాల పరిచయం కోసం చేసుకున్న కక్కుర్తి హస్తమని, అందుకే వాటిపై నేతల ముఖాలను ప్రింట్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘అమ్మహస్తం’ పథకం ద్వారా అందించే సరుకుల ప్యాకెట్లపై సీఎం కిరణ్ తో పాటు పలువురు మంత్రుల ఫొటోలు ముద్రించి ఉండటాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. అమ్మహస్తంలో ఇస్తున్న సరుకులు సగం ధరకే బీజేపీ సరఫరా చేస్తుందని దమ్ముంటే సరుకుల సరఫరా తమకు ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు.