పవన్‌కళ్యాణ్ ఈమధ్యే తిరిగి కొంచెం డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అదిరిపోయే డాన్సులు వేయకపోయినా తనదైన శైలిలో అభిమానుల్ని అలరిస్తున్నాడు. తన తదుపరి చిత్రంలో కూడా పవన్ డాన్సులు బాగుంటాయని టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సూపర్ స్టెప్స్ వేస్తున్నాడట.
ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్‌తో జల్సా, గబ్బర్‌సింగ్ చేసిన దేవి ఆ సినిమాలకి తన సంగీతంతో పెద్ద ప్లస్ అయ్యాడు. ఈ సినిమాతో ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ఖాయమని అంటున్నారు. జల్సా, జులాయి తర్వాత త్రివిక్రమ్ సినిమాకి దేవి సంగీతం అందించడం ఇది మూడోసారి. ఈ కాంబినేషన్‌లో కూడా ఇది హ్యాట్రిక్ సినిమా అవనుందట. ఈ చిత్రానికి అత్తారింటికి దారేది అనే ఆసక్తికరమైన టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.