ఎప్పటికప్పుడు తనని తానే ఛాలెంజ్ చేసుకోవడంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పెట్టింది పేరు. ప్రతీసారి ఏదో కొత్తగా ప్రేక్షకులకు చూపించాలి అంటూ చాలా ప్రయోగాలు చేస్తుంటాడు. డ్యాన్సుల్లో, బట్టల్లో, డైలాగ్ డెలివరీలో చాలా మార్పులు చేస్తుంటాడు.
ఈ మద్యన ప్రతీ హీరో నేలమీద పాకేసే స్టెప్పులు, కిందనుండి పైకి లేచే స్టెప్పులు వేసేయడంతో, జులాయ్ సినిమాలో అలాంటి వాటికి స్వస్తి చెప్పేసి మనోడు కొత్త రకం స్టెప్పులతో రంజింపజేశాడు. ఇక త్వరలో రానున్న ఇద్దరమ్మాయిలతో సినిమాలో అయితే మరింత రెచ్చిపోయాడట. టాలీవుడ్‌లోని డ్యాన్సింగ్ స్టార్లందరూ ఆశ్చర్యపోయేలా కొన్ని మైండ్ బ్లోయింగ్ కంపోజిషన్లు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కేవలం డ్యాన్స్ ట్రీట్ కాదని, తెలుగు ఇండస్ట్రీలోని టాప్ డ్యాన్సర్లైన ఎన్టీఆర్, రామ్‌చరణ్, రామ్ వగైరా హీరోలకు ఇది పెద్ద ఛాలెంజ్ అంటున్నారు బన్నీ అభిమానులు. మరి ఈ స్టయిలిష్ ఛాలెంజ్‌ను తట్టుకోవాలంటే వాళ్లు కూడా కొత్త స్టెప్పులతో లుక్కులతో రావల్సిందే...