ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 25 July 2013

    ఇద్దరూ కలిసి షాకిచ్చారు!

    Anushka Sharma, Deepika Padukone, Katrina Kaif, Ranbir Kapoor
    టాలీవుడ్లో అంత ఉండదు కానీ, బాలీవుడ్లో మాత్రం హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ భయంకరంగా ఉంటుంది. బాహాటంగానే జుట్లు పట్టుకుంటుంటారు వాళ్లు. అయితే కేవలం సినిమాల కోసమే కాదు, బాయ్ ఫ్రెండుల కోసం కూడా కొట్లాడుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడరు అక్కడి ముద్దుగుమ్మలు. దీపికా పదుకొనె, అనుష్కాశర్మలు రణబీర్ కపూర్ కోసం ఏ రేంజ్ లో కొట్టుకున్నారో తెలియనిది కాదు. రణబీర్ నావాడంటే నావాడు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పడమే కాదు, డైరెక్ట్ గా విసుర్లు కూడా విసురుకున్నారు. ఒకరి పాత్రలు ఒకరు కాజేసి పరస్పరం మాటల యుద్ధాలు చేశారు. దాంతో వారిద్దరి శత్రుత్వం బాలీవుడ్లో బాగా ఫేమస్ అయ్యింది. అందుకే వాళ్లిద్దరూ తన పార్టీలో ఏ గొడవ చేస్తారో అని షారుఖ్ ఖాన్ భయపడ్డాడట.

    ఇటీవల అతడి ఇంట్లో జరిగిన ఓ పార్టీకి దీపిక, అనుష్కాలిద్దరినీ ఆహ్వానించాడు. వాళ్లిద్దరూ కచ్చితంగా ఏదో ఒక వంకతో గొడవ పడతారు అనే అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్సయ్యింది. ఇద్దరూ కలిసి తెగ డ్యాన్స్ చేసేశారు. నవ్వుకుంటూ బోలెడన్ని కబుర్లు చెప్పేసుకున్నారు. అనుష్క అయితే యే జవానీ హై దివానీ సినిమాలో దీపిక నటన అద్భుతం అంటూ గ్యాప్ లేకుండా పొగిడేసింది. దాంతో అక్కడున్నవారంతా షాకైపోయారు. పిల్లి ఎలుకల్లా ఉండేవాళ్లు ఇంత ఫ్రెండ్ ఎప్పుడైపోయారా అని నోళ్లు వెళ్లబెట్టి చూస్తూండిపోయారు. అదీ సంగతి. ఎంత కొట్టుకున్నా ఏం లాభం, రణబీర్ కత్రినా వెంట తిరుగుతున్నాడు కదా అనుకుని ఉంటారేమో!

    Tollywood

    Bollywood

    Kollywood