ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 25 July 2013

    బికినీతో చరణ్‌కి ట్రబుల్‌

    Ram Charan, Yevadu, Amy Jackson Bikini, Censor Board
    బాలీవుడ్‌లో బికినీలు వేసుకుని హీరోయిన్లు సినిమా అంతటా తిరిగేసినా కానీ పెద్దగా పట్టించుకోరు కానీ తెలుగులో హీరోయిన్‌ సంగతి అటుంచి సైడ్‌ డాన్సర్లు బికినీలు వేసుకున్నా కానీ సెన్సార్‌ బోర్డు బ్లర్‌ చేసి పారేస్తుంది. 'బిజినెస్‌మేన్‌' చిత్రం విషయంలో సెన్సార్‌ బోర్డు చేసిన ఓవరాక్షన్‌ గుర్తుండే ఉంటుంది. 'సారొస్తారా' పాటలో డాన్సర్లందరినీ బ్లర్‌ చేసి పాట అందాన్నే చెడగొట్టి పారేశారు. అయితే ఎల్లప్పుడూ ఇలా జరగదు. 'మిర్చి' సినిమా మొదటి పాటలో బికినీ మోడల్స్‌తో కలిసి ప్రభాస్‌ డాన్స్‌లేశాడు. అందులో అలాంటి బ్లర్‌ ఎఫెక్ట్‌లేమీ లేవు. అలాగే తీన్‌మార్‌లో పవన్‌కళ్యాణ్‌ కూడా బికినీలు వేసుకున్న అమ్మాయిలతో చిందులేశాడు. అక్కడా అలాంటిదేమీ జరగలేదు.

    దీనిని బట్టి సెన్సార్‌ బోర్డ్‌ సభ్యుల మూడ్‌ని బట్టి బికినీ సాంగ్స్‌లో ఆ బ్లర్‌లు ఉంటాయో లేదో అనేది తేలుతుందని అర్థమైంది. 'ఎవడు'లో ఏమీ జాక్సన్‌పై తీసిన బీచ్‌ సాంగ్‌లో హీరోయిన్‌తో సహా అందరూ బికినీల్లో చిందులేశారు. మరి ఈ పాటకి సెన్సార్‌ బృందం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుందా లేక దీని పేరు చెప్పి అడల్ట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేస్తారా? ఎవడు థియేట్రికల్‌ ట్రెయిలర్‌లో 'దీనెమ్మ', 'నా కొడకా' అనే పదాలని కూడా మ్యూట్‌ చేశారు. మరీ ఆ రేంజ్‌ స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ తగిలితే మాత్రం ఎవడుకి బికినీ ట్రబుల్స్‌ తప్పవు.

    Tollywood

    Bollywood

    Kollywood