ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 17 July 2013

    స్టేజీమీద ప‌వ‌న్ కళ్యాణ్ స్టెప్పులు వేస్తాడా?

    Pawan kalyan dance | stage
    ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మంలో హీరోల సంద‌డి ఎక్కువైందీ మ‌ధ్య‌. దేవిశ్రీ ప్ర‌సాద్ లాంటివాళ్లు ఉంటే... మరీనూ. డీఎస్ పీ లాక్కొచ్చి మ‌రీ... స్టెప్పులు వేయిస్తాడు. స్టేజీపై అస‌లు మాట‌లే మాట్లాడ‌ని ర‌వితేజ కూడా చిందులేశాడు. నాగార్జున లాంటి సీరియ‌న్ కూడా మాసీగా స్టెప్పులేశాడు. సుశాంత్‌లాంటి యంగ్ హీరోలు రెచ్చిపోయారు. త‌మిళ తంబీలు సూర్య‌, కార్తి కూడా రంగంలోకి దిగిపోయారు.

    మ‌రి అత్తారింటికి దారేది ఆడియోలోనూ ప‌వ‌న్ స్టెప్పు వేయ‌నున్నాడా?? వేస్తే బాగుండ‌ను అనేది అభిమానుల ఆకాంక్ష‌. అక్క‌డ త‌ప్ప‌కుండా దేవిశ్రీ ప్ర‌సాద్, బాబాసెహ‌గ‌ల్ ల హంగామా ఉంటుంది. దేవి అంద‌రినీ మొహ‌మాటపెట్టేసిన‌ట్టు ప‌వ‌న్‌ని కూడా పెట్టేస్తే... కాలు క‌ద‌ప‌క‌పోతాడా..? అనేది అభిమానుల ఆశ‌.


    ప‌వ‌న్ క్ర‌మంగా మారుతున్నాడు. ఇది వ‌ర‌కు ఆడియో రిలీజ్ అంటే ఆమ‌డ దూరం జ‌రిగే క‌ల్యాణ్‌... జ‌ల్సా నుంచి ఆ సంప్ర‌ద‌యానికి తెర లేపాడు. బ‌య‌ట వేడుక‌ల‌కూ హాజ‌ర‌వుతున్నాడు. ఇప్పుడు స్టెప్పు కూడా వేస్తే... అంత‌కంటే కావల్సింది ఏముంది..? ఈనెల 19న ఆ ఘ‌ట్టం చూడ్డానికి సిద్ధంగా ఉండండి.

    Tollywood

    Bollywood

    Kollywood