వచ్చేనెల 7 వ తారీఖున విడుదల కాబోతున్న పవన్ “అత్తారింటికి దారేది” సినిమాకు సంబంధించి మరొక కొత్త రూమర్ అటు పవన్ ఇటు మహేష్ అభిమానుల మధ్య హడావుడి చేస్తోంది. ఈ రూమర్ రావాడానికి ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా గురించి ఈమధ్య చెప్పిన కొన్ని మాటలు. పవన్, మహేష్ అభిమానులకు ఒక పెద్ద విందు భోజనంలా తన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఉంటుంది అని త్రివిక్రమ్ చెప్పడం, ఏ ఉద్దేశంతో చెప్పాడు అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి.
ఈ మధ్య నే విడుదల అయిన ఈ సినిమా టీజర్ బట్టి ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు గౌతమ్ నందా అని అందరికీ తెలిసిపోయింది. ఈ పాత్ర పేరు గౌతమ్ నందా గా ఉండడమే ఈ రూమర్స్ ట్విస్ట్ కు ప్రాణం పోసింది అని అంటున్నారు. మహేష్ కొడుకుపేరు లోని గౌతమ్ కృష్ణ లో గౌతమ్ పదాన్ని, అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అకీరా నందన్ లో నందా పదాన్ని చేర్చి, దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా హీరో పేరును గౌతమ్ నందా గా మార్చాడని అంటున్నారు. మహేష్ కూ, పవన్ కూ అత్యంత ఆత్మియుడైన త్రివిక్రమ్ సరదాగా ఈ సినిమాలో ఈ ప్రయోగం చేశాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా, కొంతమంది మరొక అడుగు ముందుకు వేసి, ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమాలో కొన్ని క్షణాల పాటు కనిపిస్తాడు అనే వార్తలను మళ్ళి ముందుకు తీసుకువచ్చారు.
గతంలో ఇటువంటి వార్తలు ఫిల్మ్ నగర్ లో హడావుడి చేస్తుంటే, దర్శకుడు త్రివిక్రమ్ ఆ వార్తలను ఖండించాడు. కాని ఏదో ఒక మహేష్ బాబు ప్రస్తావన లేకుండా ఈ సినిమా ఉండదని, అందుకంటే త్రివిక్రమ్ ఈ సినిమా పవన్ , మహేష్ అభిమానులకు విందు భోజనం గా ఉంటుందనే మాటలు వాడడాని కొంతమంది వాదన. ఈ వార్తలను బట్టి చూస్తే, మహేష్ ఈ సినిమాలో నటించినా, నటించకపోయినా గతంలో జల్సా సినిమాలో మాదిరిగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటాడని మరికొందరు అంటున్నారు. ఈ వార్తలలో ఎన్ని నిజలో తెలియాలి అంటే మనం వచ్చే నెల 7 వ తారిఖు దాకా ఆగాల్సిందే.